Thailand Flood : దక్షిణ థాయ్లాండ్ (South Thailand) లోని సొంగ్ఖ్లా ప్రావిన్స్ (Songkhla province) లోగల హాట్ యాయ్ (Hatt Yai) మున్సిపాలిటీలో శనివారం కుంభవృష్టి కురిసింది. దాంతో ఆ ప్రాంతాన్ని తీవ్ర వరదలు ముంచెత్తాయి. నివాస ప్రాంతాలు నీట మునిగాయి. హాట్ యాయ్ మున్సిపాలిటీలో పలు ప్రాంతాలు మోకాళ్ల లోతు నీళ్లలో చిక్కుకున్నాయి.
భారీ వరదల నేపథ్యంలో మున్సిపాలిటీలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. మొత్తం 103 కమ్యూనిటీలకు రెడ్ ఫ్లాగ్ (Red Flag) తరలింపు ఉత్తర్వులు జారీ చేశారు. గడిచిన మూడు రోజుల్లో అక్కడ 595 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాంతో స్థానికులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు ఆదేశించారు.