Madhavan | నేచురల్ బ్యూటీయే అసలైన అందం.. ఖరీదైన ట్రీట్మెంట్లపై ఆర్.మాధవన్ సంచలన వ్యాఖ్యలు
Madhavan | ప్రస్తుతం సినీ పరిశ్రమలో అందంగా కనిపించేందుకు ఖరీదైన బ్యూటీ ట్రీట్మెంట్లు, ఫేస్ ఫిల్లర్లు, కాస్మెటిక్ ప్రొసీజర్లు చేయించుకోవడం సాధారణమైపోయింది. ముఖ్యంగా సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్స్ కావడంతో ఎప్పుడూ యవ్వనంగా, ఆకర్షణీయంగా కనిపించాలనే ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. అందుకే చాలా మంది హీరోలు, హీరోయిన్లు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ప్రత్యేక చర్మ సంరక్షణ చికిత్సలు తీసుకుంటున్నారు.
Madhavan | ప్రస్తుతం సినీ పరిశ్రమలో అందంగా కనిపించేందుకు ఖరీదైన బ్యూటీ ట్రీట్మెంట్లు, ఫేస్ ఫిల్లర్లు, కాస్మెటిక్ ప్రొసీజర్లు చేయించుకోవడం సాధారణమైపోయింది. ముఖ్యంగా సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్స్ కావడంతో ఎప్పుడూ యవ్వనంగా, ఆకర్షణీయంగా కనిపించాలనే ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. అందుకే చాలా మంది హీరోలు, హీరోయిన్లు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ప్రత్యేక చర్మ సంరక్షణ చికిత్సలు తీసుకుంటున్నారు. అయితే ఈ ట్రెండ్ మధ్య కోలీవుడ్ స్టార్ హీరో ఆర్. మాధవన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఒకప్పుడు తమిళ చిత్రసీమలో వరుస విజయాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మాధవన్ ప్రస్తుతం బాలీవుడ్లో కూడా బిజీగా కొనసాగుతున్నారు. 50 ఏళ్లు దాటినా ఇంకా యువకుడిలా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు.
ఈ నేపథ్యంలో ఆయన యవ్వన రహస్యం ఏమిటి అని అభిమానుల్లో ఆసక్తి నెలకొనడం సహజం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న ఎదురవగా మాధవన్ ఇచ్చిన సమాధానం అందరినీ ఆలోచింపజేసేలా ఉంది. యవ్వనంగా కనిపించేందుకు ఆర్టిఫిషియల్ టెక్నిక్స్ ఉపయోగించడం ఒక రకంగా మోసమే. వృద్ధాప్యాన్ని సహజంగా అంగీకరించడం నేర్చుకోవాలి. నేను ఎలాంటి ఫిల్లర్లు, ఖరీదైన బ్యూటీ ట్రీట్మెంట్లు చేయించుకోను అని మాధవన్ స్పష్టం చేశారు. తన చర్మ సంరక్షణ రహస్యం ఎంతో సింపుల్ అని చెబుతూ ప్రతిరోజూ కొబ్బరినూనె ఉపయోగిస్తానని, ఉదయం సూర్యరశ్మిని ఆస్వాదించడం మిస్ కావడంలేదని తెలిపారు. ఇవే తన నేచురల్ స్కిన్ కేర్ టిప్స్ అని చెప్పారు.
అంతేకాక ప్రతి ఆదివారం నువ్వుల నూనెతో తలస్నానం చేయడం తనకు అలవాటని, గత 20 ఏళ్లుగా ఇదే పద్ధతిని కొనసాగిస్తున్నానని వెల్లడించారు. ఆహార విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని, బయట ఫుడ్ కంటే ఇంట్లో వండిన తాజా ఆహారానికే ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు. షూటింగ్‌లకు కూడా తన చెఫ్‌ను వెంట తీసుకెళ్లి పప్పు, కూర, అన్నం వంటి సాధారణ ఆహారమే తీసుకుంటానని చెప్పారు. మాధవన్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. ఖరీదైన ట్రీట్మెంట్లకు బదులుగా సింపుల్ జీవనశైలి, సహజ పద్ధతులు, సమతుల్య ఆహారం పాటిస్తే ఆరోగ్యంగా, అందంగా ఉండవచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఒత్తిడి లేని జీవితం, సరైన ఆహారపు అలవాట్లు, నేచురల్ కేర్నే అసలైన ఫిట్నెస్ సూత్రాలుగా మాధవన్ ఉదాహరణ నిలుస్తున్నారని అభిమానులు ప్రశంసిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లి మండలంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Zimbabwe Cricket | టీమిండియాతో చరిత్రాత్మక సిరీస్.. జింబాబ్వే స్క్వాడ్ ప్రకటన..!
Smit Machchhar | ఫ్లై దుబాయ్ ఘటన.. ఇండియన్ కెప్టెన్‌పై కో పైలట్ దాడి.. కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
Gautam Prasad | ‘పెండింగ్‌లో రూ.4 వేల కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. ఎంపీ వంశీకృష్ణ నీకు దమ్ముంటే ప్రజలకు సమాధానం చెప్పు’
ట్రెండింగ్ వార్తలు
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్

