YS Sharmila | పోలీసులతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దురుసుగా ప్రవర్తించారు. ఎస్సై, మహిళా కానిస్టేబుల్‌పై ఆమె చేయిచేసుకున్నారు.
సోమవారం ఉదయం లోటస్‌పాండ్‌లోని తన నివాసం నుంచి బయల్దేరిన వైఎస్ షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. సిట్ కార్యాలయానికి వెళ్తున్నారనే సమాచారంతో ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా చూసేందుకు ఆమెను బయటకు రాకుండా నిలిపివేశారు. దీంతో పోలీసులతో వైఎస్ షర్మిల వాగ్వాదానికి దిగారు. ఆమెను అడ్డుకునేందుకు యత్నించిన ఎస్సై, మహిళా కానిస్టేబుల్‌ను చేతితో పక్కకు నెట్టేశారు. వారితో దురుసుగా ప్రవర్తించారు. అంతేకాకుండా అక్కడే రోడ్డుపై బైఠాయించారు. ఈ క్రమంలో లోటస్‌పాండ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో వైఎస్ షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను అరెస్టు చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
తన నివాసం నుంచి బయల్దేరిన వైఎస్ షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. ఉద్రిక్త వాతావరణాన్ని రెచ్చగొట్టే అవకాశం ఉండటంతో ఆమెను బయటకు రాకుండా నిలిపివేశారు. దీంతో పోలీసులతో షర్మిల వాగ్వాదానికి దిగారు. ఆమెను అడ్డుకునేందుకు యత్నించిన ఎస్సై, మహిళా కానిస్టేబుల్‌ను చేతితో పక్కకు నెట్టేశారు. pic.twitter.com/qxFIjaWqGr
— Namasthe Telangana (@ntdailyonline) April 24, 2023
షర్మిల అరెస్టుపై డీసీపీ జోయల్ డేవిస్ స్పందించారు. పోలీసులపై షర్మిల దాడి చేశారని ఆయన పేర్కొన్నారు. షర్మిల సిట్ ఆఫీసుకు వెళ్తారనే సమాచారం ఉందని.. అందుకే ఆమెను ముందస్తుగా అరెస్టు చేయడానికి ప్రయత్నించామని వివరించారు. పోలీసుల ఫిర్యాదు మేరకు షర్మిలపై కేసు పెడతామని తెలిపారు. ఎస్సై ఫిర్యాదు ఆధారంగా షర్మిల కేసులో ముందుకెళ్తామని సీవీ ఆనంద్ వెల్లడించారు.