చిక్కడపల్లి, ఫిబ్రవరి 21: గంజాయి సరఫరా చేస్తున్న ముగ్గురు యువకులను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ సీతయ్య కథనం ప్రకా రం.. చిక్కడపల్లి పరిధిలోని పీ అండ్ టీ కాలనీలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు గంజాయి సరఫరా చేస్తున్నట్టు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు చిక్కడపల్లి పోలీసులు నిఘా పెట్టి.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా..
బాలానగర్‌కు చెందిన సయ్యద్ ఓమర్, అశోక్‌నగర్‌కు చెందిన ఆవుల సాయి తరుణ్, రాంనగర్‌కు చెందిన దాసరి శ్రీధర్ అని తేలింది. నిందితుల నుంచి 500 గ్రాముల గంజాయి, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.