హైదరాబాద్ : హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో(SR Nagar,) దారుణం చోటు చేసుకుంది. నిద్ర విషయంలో ఘర్షణ ఓ యువకుడి ప్రాణాన్ని బలితీసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఎస్సార్ నగర్‌లోని హనుమ హాస్టల్లో గణేష్, వెంకటరమణ అనే ఇద్దరు వ్యక్తులు ఒకే రూంలో ఉంటున్నారు. గణేష్ సెలూన్ షాప్‌లో పనిచేస్తుం డగా, వెంకట రమణ ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పని చేస్తున్నాడు. కాగా, గణేష్ రోజు మందు తాగుతూ నిద్రకు ఆటంకం కలిగిస్తున్నాడని వెంకటరమణ కోప్పడ్డాడు.
దీంతో ఇద్దరి మధ్య మాట మాట పెరిగి వెంకటరమణపై గణేష్ కటింగ్ షాప్‌లో ఉపయోగించే కత్తితో విచక్షణారహితంగా దాడి(Youth stabbed) చేశాడు. తీవ్రంగా గాయపడిన వెంకట రమణ స్పాట్లోనే చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుడిని ఏపీలోని కర్నూల్ జిల్లా ఆలమూరు గ్రామ నివాసిగా గుర్తించారు.