కందుకూరు, మే 26 : క్రీడల్లో రాణించిన యువకులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని నవతరం యూత్ అధ్యక్షుడు రాజశేఖర్ గుప్తా తెలిపారు. నవతరం ప్రీమియర్ లీగ్ సీజన్ 5ని కందుకూరు మండల కేంద్రంలో గల వైఎస్ఆర్ మినీస్టేడియంలో నిర్వహించారు. ఇందులో గెలుపొందిన వారికి నగదుతో పాటు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి కింద ధోనీ టీమ్ ( శివగౌడ్)కు సౌడపు శేఖర్ గౌడ్ రూ.30 వేలు, రెండో బహుమతి కింద తాళ్ల అఖిల్ సోను టీమ్‌కు ఢిల్లీ కృష్ణ ముదిరాజ్ రూ.17 వేలను అందజేశారు. విజేతలు, రన్నరప్‌లకు నిర్వాహకులు షీల్డ్స్, మెడల్స్ అందజేశారు.
ఈ సందర్భంగా నిర్వాహకులుమాట్లాడుతూ.. నవతరం యూత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించి యువకుల్లో ఉత్సాహం నింపుతున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో మండల కేంద్రంలో నవతరం యూత్ ఆధ్వర్యంలో మరిన్ని స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తామని పేర్కొన్నారు.