Old City : వినాయక చవితి పండుగ వేళ ఓల్డ్ సిటీలో విషాదం చోటు చేసుకుంది. రవీంద్ర నాయక్ నగర్‌ని గణేశుడి మండపం (Ganesh Mandap) వద్ద బ్యానర్ ఏర్పాటు చేస్తుండగా కరెంట్ షాక్‌తో భరత్ (Bharath) అనే యువకుడు మృతి చెందాడు. అప్పటివరకూ స్నేహితులతో సరదాగా గడిపిన అతడు విద్యుద్ఘాతంతో మరణించడంతో అందరూ కన్నీరుమున్నీరవుతున్నారు. అతడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.