శేరిలింగంపల్లి, ఏప్రిల్ 12: ఓ ద్విచక్ర వాహనదారుడు నిర్లక్ష్యంగా, అతి వేగంగా వాహనం నడిపించి మరో టూవీలర్ను ఢీకొట్టగా, ఓ యువకుడు అక్కడిక్కడే మృతి చెం దడతోపాటు, మరో యువకుడికి గాయాలై చికిత్స పొందుతున్న ఘటన గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శేరిలింగంపల్లిలోని నల్లగండ్ల గుల్మోహర్ పార్క్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కాలనీలో నివాసం ఉంటున్న అయిత యాదయ్య స్థానికంగా ఆటో డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబంతో కలి సి జీవిస్తున్నాడు.
అతని కుమారుడు అయిత ప్రభు కిరణ్ (18) ఇంటర్ మొదటి సంవత్స రం చదువుతున్నాడు. ఈ నెల 11న రాత్రి 10 గంటల సమయంలో ప్రభు కిరణ్ తన స్నేహితుడు విష్ణుతో కలిసి పల్సర్ బైక్పై బయటకు వెళ్లారు. నల్లగండ్ల నుంచి గచ్చిబౌలికి వస్తుండగా మార్గమధ్యలో గచ్చిబౌలి స్టేడియం రెండో నంబర్ గేట్ వద్ద యు టర్న్ తీసుకుంటుండగా గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వైపు బుల్లెట్ ద్విచక్ర వాహనంపై వస్తు న్న వ్యక్తి వాహనాన్ని అతి వేగంగా ఢీ కొట్టా డు.
ఈ ఘటనలో ప్రభు కిరణ్ అక్కడికక్కడే మృతి చెందగా, విష్ణుకు గాయాలై హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రభు కిరణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.