శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 11: ద్విచక్రవాహనం ప్రమాదవశాత్తు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని కిందపడి ఓ యువకుడు మృతిచెందగా మరో యువకుడు స్వల్పగాయాలకు గురైన సంఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మెడ్చల్ జిల్లా, శామీర్‌పేట్ మండలం, అలియాబాద్‌కు చెందిన గోర్లి ఉదయ్‌రెడ్డి (22) ఇస్నాపూర్‌లోని ఓ ప్రైవేట్కంపెనీలో సూపర్వైజర్గా విదులు నిర్వరిస్తు గౌలిదొడ్డిలోని పీజీ హాస్టల్లో నివసిస్తున్నాడు.
బుదవారం అర్ధరాత్రి గచ్చిబౌలి నుంచి గౌలిదొడ్డి వైపు స్నేహితుడు సత్యసాగర్తో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. మార్గమద్యలో విప్రోసర్కిల్ వద్ద ప్రమాదవశాత్తు ద్విచక్రవాహనం అదుపుతప్పి ఢీవైడర్కు ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలకు గురైన ఉదయ్‌రెడ్డిని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ హాస్పటల్‌కు తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందాడు. సత్యసాగర్ స్వల్పగాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.