మేడ్చల్, సెప్టెంబరు 15 : చేపలు పట్టడానికి వెళ్లిన యువకుడు మృతిచెందిన ఘటన శామీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.
పోలీసుల కథనం ప్రకా రం..తూం కుంట మున్సిపాలిటీ పరిధిలోని నల్లకుంట చెరువు నీటిలో డబుల్ బెడ్ రూం పక్కన ఏర్పడిన కాల్వ లో జవహర్‌నగర్‌కు చెందిన వల్లపు హనుమయ్య (28) సోమవారం మధ్యా హ్నం స్నేహితులతో కలిసి చేపలు పట్టడానికి వెళ్లి లోతులోకి వెళ్లి మునిగిపోయాడు.
పో లీసులు అగ్నిమాపక శకట సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని వెలికి తీశారు. కేసు ద ర్యాప్తు చేస్తున్నారు.