పీర్జాదిగూడ మార్చి 16: నీటి సంపును శుభ్రం చేస్తున్న క్రమంలో ఊపిరి ఆడక యువకుడు మృతి చెందిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీర్జాదిగూడ మల్లికార్జున నగర్ కాలనీలో నివాసం ఉంటున్న పల్లె శ్యామల కుమారుడు గణేష్ (19 )నగరంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు.
అయితే ఆదివారం మధ్యాహ్నం సమయంలో తన ఇంటి యజమాని నీటి సంపును శుభ్రం చేయమని అడగడంతో సంపులోకి దిగిన గణేష్ శుభ్రం చేస్తున్న క్రమంలో శ్వాస ఆడక మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.