కందుకూరు, జనవరి 6 : నగర శివారులోని కందుకూరులో ఓ రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. కందుకూరు పోలీసుల కథనం ప్రకారం వివరాలు నాగర్కర్నూల్ జిల్లా తాండూరు మండలం బాలన్నపల్ల్లి గ్రామానికి చెందిన చిన్నయ్య కుమారుడు భరత్ (20)తో పాటు రైతులు కొమ్ము దయాకర్, పసుపుల కుమార్, మనకూరి రమేశ్, గోనెల సాయి, డ్రైవరు శివకుమార్ యొక్క బొలెరో వాహనంలో హైదరాబాద్లో ఎండు మిర్చి అమ్మడానికి బయలుదేరారు.
వారు స్వగ్రామం నుంచి ఆదివారం రాత్రి దెబ్బడగూడ గేటు సమీపంలోకి రాగానే కందుకూరు నుంచి కడ్తాల్ వైపు వెలుతున్న కారు అజాగ్రత్తగా వచ్చి బోలెర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో వాహనంలో ఉన్న భరత్ మృతి చెందాడు. మిగిలిన రైతులకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియ దవాఖానకు తరలించి కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.