మల్కాజిగిరి, అక్టోబర్ 2: గంజాయి మొక్కలను పెంచుతున్న ఓ యువకుడిని మల్కాజిగిరి పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ సత్యనారాయణ కథనం ప్రకారం.. ఈస్ట్ ఆనంద్‌బాగ్‌కు చెందిన వెంకటరాజు(19) కొంత కాలంగా ఆనంద్‌బాగ్ రైల్వే ట్రాక్ సమీపంలో గంజాయి మొక్కలను పెంచుతున్నాడు.
విశ్వసనీయ సమాచారం మేరకు.. రైల్వే ట్రాక్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వెంకటరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న పచ్చి గంజాయి మొక్క కొమ్మలను స్వాధీనం చేసుకున్నారు. అతడిని విచారించడంతో.. రైల్వే ట్రాక్ సమీపంలో గంజాయి మొక్కలను పెంచుతున్నట్లు తెలిపాడు. పోలీసులు రెండు గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు.