Congress Govt | సిటీబ్యూరో: నాడు గ్రూప్-1 అభ్యర్థులపై.. నేడు హెచ్‌సీయూ విద్యార్థులపైన.. ఏడాది కాలంలో రెండు సార్లు పోలీసు లాఠీ విరిగింది. తమ న్యాయమైన డిమాండ్ కోసం గతేడాది జూలై, ఆగస్టులో రోడెక్కిన గ్రూప్-1 అభ్యర్థులపై పోలీసులతో లాఠీచార్జీ చేయించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. తాజాగా భూములను వేలం వేయవద్దంటూ నిరసనకు దిగిన హెచ్‌సీయూ విద్యార్థులపై మరోసారి లాఠీలు ఝూళిపించింది.
విద్యార్థులకు అన్నివిధాలుగా అండగా ఉంటామంటూ.. నాడు హెచ్‌సీయూను సందర్శించిన రాహుల్ గాంధీ.. 2023లో జరిగిన ఎన్నికల ప్రచారంలో చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి వచ్చి, గ్రూప్స్‌నకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఉద్యోగవకాశాలు కల్పించి, అండగా ఉంటామంటూ మాట ఇచ్చారు. ఆనాడు కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ సందర్శించిన హెచ్‌సీయూ, అశోక్‌నగర్ రెండు ప్రాంతాల్లోనూ నేడు రేవంత్ సర్కార్ పోలీసు లాఠీలతో విద్యార్థులపై విరుచుకుపడటం గమనార్హం.