వెంగళరావునగర్, సెప్టెంబర్ 4: అమీర్‌పేటలోని అమోఘ హోటల్లో విద్యుత్ షాక్‌కు గురై.. హోటల్లో పనిచేసే ఓ కార్మికుడు మృతి చెందాడు. ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్‌రెడ్డి కథనం ప్రకారం.. బీహార్ రాష్ర్టానికి చెందిన అమిత్(23), అతడి సోదరుడు పాశ్వాన్‌తో కలిసి అమీర్‌పేట సత్యం మాల్ సమీపంలోని అమోఘ హోటల్లో కార్మికులుగా పనిచేస్తున్నారు. బుధవారం ఉదయం 9 గంటల సమమంలో హోటల్లో వెట్ గ్రైండర్‌పై పనిచేస్తుండగా.. ఆ గ్రైండర్కు విద్యుత్ సరఫరా అయ్యింది.
దీంతో పెద్ద శబ్దం వచ్చింది. తోటి కార్మికులు చూడగా విద్యుత్‌షాక్‌తో అమిత్ కిందపడిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని తోటి కార్మికులు వెంటనే సమీపంలోని దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందినట్లు నిర్ధారించారు. అమిత్ సోదరుడు పాశ్వాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హోటల్లో ఎటువంటి రక్షణ ఏర్పాట్లు లేకపోవడం, యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించిన ఎస్ఆర్ నగర్ పోలీసులు.. హోటల్ యజమాని రంగనాథ్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
బండ్లగూడ: గణేశ్ విగ్రహం తరలిస్తున్న క్రమంలో ఓ వ్యక్తి విద్యుత్ షాక్‌కు గురై తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పాండురంగానగర్‌కు చెందిన రమేశ్ శర్మ గణేశ్ నవరాత్రులు సందర్భంగా స్నేహితులతో కలిసి వినాయకుడి విగ్రహాన్ని తీసుకుని వస్తుండగా విద్యుత్ తీగలు తగిలి షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో అతడు కింద పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని తోటి స్నేహితులు స్థానిక ఆస్పత్రికి తరలించారు.