బడంగ్‌పేట, జనవరి 29: బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేసి క్షేత్ర స్థాయిలో పార్టీ మరంత పటిష్టం చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మేయర్, డిఫ్యూటీ మేయర్, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులతో సమావేశం మంత్రి నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి సబిత మాట్లాడుతూ.. ప్రతి కార్పొరేటర్ పార్టీలో అందర్నీ సమన్వయం చేసుకుని బీఆర్ఎస్ను మరింత ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల వద్దకు చేరేలా చొరవ చూపాలని ఆదేశించారు. మహేశ్వరం నియోజకవర్గంలోని ప్రతి వార్డులో బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేయాలని అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలను తెలంగాణలో అమలవుతున్నాయని, మన పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీ కొడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గాదీప్‌లాల్ చౌహాన్, డిఫ్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కో-ఆప్షన్ సభ్యులు, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
శివాజీ విగ్రహం కోసం వినతి
బాలాపూర్‌లోని శివాజీ చౌక్‌లో ఉన్న శివాజీ విగ్రహం స్థానంలో నిలువెత్తు విగ్రహం ఏర్పాటు చేయించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఆదివారం జిల్లెలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాలాపూర్ బీఆర్ఎస్ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు గుండు రఘునందనచారి, బాలాపూర్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కళ్లెం ఎల్లారెడ్డి, అత్తాపురం శ్రీనివాస్‌రెడ్డి, తిమ్మని గిరీశశ్, నితిన్‌రెడ్డి, గోపాల్ నాయక్, తలారి యాదగిరి, గడ్డం అనిల్, కొప్పుల పండరినాథ్, శ్రీకాంత్, రంజిత్, కేదారినాథ్, నరేశశ్ తదితరులు పాల్గొన్నారు.
దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
కందుకూరు, జనవరి 29: దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 1వ తేదీన మండల పరిధిలోని కొత్తగూడ గ్రామంలో నిర్మిస్తున్న సూర్యనారాయణ రామలింగేశ్వర ఆంజనేయ స్వామి ఆలయ శంకుస్థాపనకు రావాల్సిందిగా ఆలయ కమిటీ సభ్యులు ఆదివారం మంత్రి క్యాంపు కార్యాలయంలో కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురుసాని సురేందర్‌రెడ్డి, సర్పంచ్ మల్లారెడ్డి, మాజీ సర్పంచ్ యాదయ్య, మాజీ డైరెక్టరు ప్రకాష్‌రెడ్డి, యూత్ నాయకులు తాళ్ల కార్తీక్, సోషల్ మీడియా కన్వీనర్ దీక్షిత్‌రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ప్రియాంకను సత్కరించిన మంత్రి
‘ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డు’ సాధించిన ప్రియాంకను ఆదివారం జిల్లెలగూడలోని క్యాంప్ కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభినందించారు. గతంలో నిర్వహించిన ‘సన్ రైజ్ టూ సన్ రైజ్ 24 గంటల మారథన్ లెక్చర్’తో తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించిన ప్రియాంక తాజాగా ఈ అవార్డును అందుకున్నారు. రికార్డులు సాధించిన ప్రియాంకను మంత్రి ఘనంగా సత్కరించారు.
– బడంగ్‌పేట, జనవరి 2