హైదరాబాద్ : కాంగ్రెస్ పాలనో సాగు, తాగు నీరు లేక ప్రజలు అల్లాడి పోతున్నారు. ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు గుక్కెడు మంచినీళ్లు ఇవ్వలేకపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీ బిందెలతో ప్రజలు రోడ్లు మీదకు వచ్చి ఆందోళన చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లోని నంది నగర్ బీరప్ప గల్లీలో మంచినీళ్లు రావడం లేదంటూ తట్టిఖనా జలమండలి కార్యాలయం వద్ద స్థానికుల ఆందోళన చేపట్టారు. తాగు నీరు అందించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.