హైదరాబాద్ : ఓ ఇంటి యజమాని తన ఇంట్లో కిరాయికి ఉంటున్న మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడు. అంతటితో ఆగకుండా.. వారిపై బీరు సీసాలతో దాడికి యత్నించాడు. ఈ ఘటన ఎల్బీనగర్ మన్సూరాబాద్‌లో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఇంటి ఓనర్ కృష్ణ గత కొద్ది రోజుల నుంచి తన ఇంట్లో ఉంటున్న మహిళలను లైంగికంగా వేధింపులకు గురి చేస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు.
దీంతో కృష్ణ వేధింపులపై బాధిత మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పోలీసులు కృష్ణను ప్రశ్నించగా, వారితో కూడా దురుసుగా ప్రవర్తించాడు. పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేశారంటూ.. నిన్న రాత్రి మరోసారి మహిళలపై కృష్ణ తన గ్యాంగ్‌తో విరుచుకుపడ్డారు. మహిళలపై బీరు సీసాలతో దాడి చేసేందుకు యత్నించాడు. దీంతో మహిళలు 100కు డయల్ చేయగా, పోలీసులు వచ్చే లోపే కృష్ణతో పాటు రౌడీమూకలు పారిపోయారు.