మలక్‌పేట, ఆగస్టు 13: ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ మహిళ చనిపోయింది. చాదర్‌ఘాట్ ఇన్స్పెక్టర్ బ్రహ్మ మురారి తెలిపిన కథనం ప్రకారం నాంపల్లి రెడ్ హిల్స్‌కు చెందిన సింధూ సూర్యన్ (45) బుధవారం ఉదయం నల్గొండ ఎక్స్‌రోడ్స్ ఫ్లై ఓవర్ వద్ద నుంచి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా, వెనుక నుంచి వేగంగా, అజాగ్రత్తగా దూసుకువచ్చిన అచ్చంపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బలంగా ఢీ కొట్టింది.
కిందపడిపోయిన సింధూ సూర్యన్ తలపై నుంచి బస్సు చక్రాలు వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. పోలీసులు బస్సు డ్రైవర్ వెంకటేశ్(35)ను అదుపులోకి తీసుకున్నారు.