Hyderabad | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో మరో దారుణం వెలుగు చూసింది. రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని కిస్మత్‌పురా బ్రిడ్జి కింద ఓ యువతి మృతదేహం లభ్యమైంది. ఆ డెడ్‌బాడీ నగ్నంగా ఉండడంతో.. ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 25 నుంచి 30 ఏండ్ల వయసున్న యువతిని మూడు రోజుల క్రితమే హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. క్లూస్ టీమ్ సహాయంతో, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ క్యాస్ట్రో వివరాల ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు కిస్మత్‌పురా బ్రిడ్జి కింద నగ్నంగా పడి ఉన్న యువతి మృతదేహం గురించి తమకు స్థానికులు సమాచారం అందించారని తెలిపారు. వెంటనే తమ పోలీసు బృందంతో అక్కడికి చేరుకుని, డెడ్‌బాడీని స్వాధీనం చేసుకున్నాం. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. యువతి మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉంది. ఎక్కడో హత్య చేసి కిస్మత్‌పురాలో పడేసినట్టుగా అనుమానిస్తున్నాం. మృతురాలి వయసు 25 నుంచి 30 సంవత్సరాలలోపు ఉంటుందని భావిస్తున్నాం. డెడ్ బాడీ దొరికిన ప్రాంతానికి సమీపంలో సీసీ కెమెరాలు ఉన్నాయి వెరిఫై చేస్తున్నాం. మహిళపై అత్యాచారం చేసి హత్య చేసినట్టు అనుమానిస్తున్నాం. హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న స్టేషన్లో ఉన్న మిస్సింగ్ కేసులను పరిశీలిస్తున్నాం. సమీప పోలీస్ స్టేషన్లలో ఏవైనా మిస్సింగ్ కేసులు ఉన్నాయా అని కూడా విచారిస్తాం. ఘటనా స్థలంలో క్లూస్, అలానే ఫింగర్ ప్రింట్స్ సేకరిస్తున్నాం. మృతురాలు ఎవరు.. ఆమెను హత్య చేసింది అన్నది ఎవరు? అన్నది త్వరలోనే తేలుస్తామని వెల్లడించారు.
బ్రేకింగ్ న్యూస్
రాష్ట్రంలో అదుపు తప్పుతున్న లా&ఆర్డర్
నగరంలో నగ్నంగా పడి ఉన్న యువతి మృతదేహం లభ్యం.. మూడు రోజుల క్రితమే హత్య చేసి పడేసినట్టు అనుమానిస్తున్న పోలీసులు
హైదరాబాద్ – రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని కిస్మత్‌పురా బ్రిడ్జి కింద లభ్యమైన నగ్నంగా పడి ఉన్న యువతి మృతదేహం… pic.twitter.com/3ZBzQomgzx
— Telugu Scribe (@TeluguScribe) September 16, 2025