Hyderabad | హైదరాబాద్ : ఈ నెల 6వ తేదీన హనుమాన్ జయంతి( hanuman Jayanthi ) సందర్భంగా రాచకొండ పోలీసు కమిషనరేట్( Rachakonda Police ) పరిధిలో మద్యం దుకాణాలను( Wine Shops ) మూసివేయాలని సీపీ డీఎస్ చౌహాన్( CP DS Chauhan ) ఆదేశాలు జారీ చేశారు. 6వ తేదీన ఉదయం 6 గంటల నుంచి 7వ తేదీన ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు, కల్లు దకాణాలు మూసి ఉంటాయని సీపీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ డీఎస్ చౌహాన్ హెచ్చరించారు.