Wine Shops | హైదరాబాద్ : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల నేపథ్యంలో ఈ నెల 13, 14 తేదీల్లో హైదరాబాద్ నగరంలో మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. సెంట్రల్, ఈస్ట్, నార్త్ జోన్ల పరిధిలో మద్యం దుకాణాలు మూసివేయనున్నట్లు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. గాంధీ నగర్, చిలకలగూడ, లాలాగూడ, వారాసిగూడ, బేగంపేట, గోపాలపురం, తుకారం గేట్, మారేడ్‌పల్లి, మహంకాళి, రాంగోపాల్‌పేట్, మార్కెట్ పోలీసు స్టేషన్ల పరిధిలో మద్యం దుకాణాలను మూసివేయనున్నారు. ఈ నెల 13వ తేదీన ఉదయం 6 గంటల నుంచి 15వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయనున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.