Jagadish Reddy | రండ గాడు పెళ్లి చేసుకున్నట్లు ప్రభుత్వం నడుపుదామని వచ్చారని, చేతకాని వాడు ఎందుకు రావాలి.. పనికిమాలిన దద్దమ్మలు ఎందుకు కుర్చీలో కూర్చోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు.
మీడియాతో ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. ఏం విచారణ చేస్తరు.. విద్యుత్ కొనుగోళ్ల కేసులో లోకూర్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చినట్లే ప్రభుత్వం ఇప్పటివరకు ఎక్కడా చెప్పలేదు. ఫలానా తేదీన లోకూర్ బాధ్యతలు తీసుకుండు.. విచారణ చేసిండు.. రిపోర్ట్ ఇచ్చిండనేది.. మాకైతే తెలియదు. నాక్కుడా నరసింహారెడ్డి ఉన్నప్పుడు నోటీసులు ఇచ్చిర్రు. ఆ తర్వాత లోకూర్ అయితే కేసీఆర్కు కానీ, నాకు కానీ ఏ అధికారులకు కానీ ఎవరికీ నోటీసులు ఇచ్చినట్టు మాకు తెలియన్నారు.
కాళేశ్వరం మీద అసెంబ్లీలో చర్చ పెట్టిన వాళ్ళు, విద్యుత్ కొనుగోళ్ల అంశాన్ని ఎందుకు అసెంబ్లీలో పెట్టలేదు..? అని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. కమిషన్ వేయడమే ఓ పనికి మాలిన చర్య అని వాళ్లు చెప్పిపోయినట్టున్నారు.ప్రజల నుండి వస్తున్న వ్యతిరేకతను దారి మళ్లించడానికి సీబీఐ విచారణ అనే డ్రామా మొదలుపెట్టారు తప్ప దానితో అయ్యేది ఏం లేదు.. మీరు ఎన్ని విచారణలు చేస్తే కేసీఆర్ అంత కడిగిన ముత్యంలా బయటికి వస్తారు. ప్రజలకు మీరు పుట్టించిన అబద్ధాలు అన్ని తెలిసిపోతాయి. సీబీఐ మోడీ జేబు సంస్థ అన్న రాహుల్ గాంధీ ఈ రోజు పెద్ద ముద్దాయి అన్నారు.