RS Praveen Kumar | బండి సంజయ్ తన కొడుకు మైనర్ బాలికపై చేసిన అఘాయిత్యం గురించి రేవంత్ రెడ్డికి ఎప్పుడో చెప్పాడని.. బండి సంజయ్ ఏమని చెప్పాడు, డీజీపీకి ఏం ఆదేశాలు ఇచ్చారో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు వివరణ ఇవ్వాలని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. నిన్న ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో నాకు 51 శాతం మంది ఓటు వేస్తే చాలు మిగతా 49 శాతం మంది వేయకపోయినా పర్లేదని అన్నాడు.. అంటే ఈ మైనర్ అమ్మాయి 49 శాతం మందిలో ఉందనా..? మీరు ఆమె గురించి పట్టించుకోవడం లేదు అని ప్రశ్నించారు. 51 శాతం దాంట్లో ఏమో బండి సంజయ్ కుటుంబం ఉంది.. 49 శాతం దాంట్లో ఈ అమ్మాయి ఉందనే మీరు పట్టించుకోవడం లేదా..? మీరు చెప్పాలని డిమాండ్ చేశారు.
నా ఎనర్జీ అంతా రాష్ట్రం కోసమే వాడుతున్నా.. నా మీద ఏమేం చేసిర్రో అన్నరు. ఇది తప్పు తప్పు అని చెప్పడానికి నా దగ్గర సాక్ష్యం ఉంది. మీరు ఈ రాష్ట్ర ప్రజల సంపదను రూ.17 కోట్ల 7 లక్షల రూపాయలను కేవలం కేసీఆర్, కేటిఆర్, హరీష్ రావు చేయని నేరానికి ఎట్లా జైలుకు పంపించాలె అన్న కుట్రమీద సుప్రీంకోర్టులో పేరు మోసిన లాయర్లను పెట్టి వృధా చేసిర్రు. ఈ ముగ్గురు నాయకుల మీద చేయని నేరానికి పెద్ద పెద్ద లాయర్లను ఒక్కొక్కరికి రూ.కోటి ఇచ్చి తీసుకొచ్చిర్రని మండిపడ్డారు. నా దగ్గర పూర్తి వివరాలున్నాయి. రేవంత్ రెడ్డి మీరు కూడా ఒక అమ్మాయికి తండ్రి.. అలాంటిది కనీసం బాధిత కుటుంబానికి ఒక్క ఫోన్ కూడా చేయలేదన్నారు. ప్రతిపక్షాల మీద లాయర్ల కోసం ఇంత ఖర్చు పెట్టే మీరు కనీసం బాధిత మైనర్ కోసం ఒక మంచి లాయర్‌ను ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు.
ఈ రాష్ట్రంలో 51 శాతం మంది నాకు ఓటు వేస్తే చాలు మిగతా 49 శాతం మంది వేయకపోయినా పర్లేదని రేవంత్ రెడ్డి అన్నాడు
అంటే ఈ మైనర్ అమ్మాయి 49 శాతం మందిలో ఉందా?
51 శాతం దాంట్లో ఏమో బండి సంజయ్ కుటుంబం ఉంది.. 49 శాతం దాంట్లో ఈ అమ్మాయి ఉందనే మీరు పట్టించుకోవడం లేదా
కేవలం కేసీఆర్, కేటిఆర్,… pic.twitter.com/O3KU8nfNui
— Telugu Scribe (@TeluguScribe) May 16, 2026