నగరంలో వారమంతా మహిళా దినోత్సవం
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురసరించుకొని జీహెచ్ఎంసీ పరిధిలో పెద్ద ఎత్తున కార్యక్రమాలను వారం రోజులపాటు నిర్వహించనున్నారు.
- రోజుకో థీమ్‌తో బల్దియా ప్రత్యేక కార్యక్రమాలు
సిటీబ్యూరో, మార్చి 7 (నమస్తే తెలంగాణ) : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురసరించుకొని జీహెచ్ఎంసీ పరిధిలో పెద్ద ఎత్తున కార్యక్రమాలను వారం రోజులపాటు నిర్వహించనున్నారు. మహిళా సాధికారత సాధనతో పాటు సామాజిక అంశాల్లో మహిళలను భాగస్వామ్యం చేయాలనే లక్ష్యంగా సరిళ్ల వారీగా వివిధ కార్యక్రమాలు చేపట్టాలని కమిషనర్ క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతాశోభన్ రెడ్డి సారధ్యంలో వేడుకలు నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ముఖ్యంగా మహిళా ఉద్యోగులు, కార్పొరేటర్లు సుమారు 300 మంది పాల్గొనే ఈ వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం సరిల్ పరిధిలో శానిటేషన్ విభాగంలో ఉత్తమ సేవలందించిన మహిళలకు ఒక్కో సర్కిల్లో ఒకొకరికి 30 మందికి సన్మానం చేస్తారు. సౌత్ జోన్లో పీడీగా పనిచేస్తున్న లావణ్య, 2023 ద్వితీయ సంసద్ ఖేల్ స్పంద్ జాతీయస్థాయి క్రీడలు ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగిన క్రాస్ బౌ షూటింగ్లో కాంస్య పతకం సాధించినందున ఆమెను కూడా ఈ సందర్భంగా సన్మానిస్తారు. అంతే కాకుండా మహిళలచే వివిధ క్రీడా, సాంసృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సుమారు 35 మంది మహిళలను సన్మానించి జ్ఞాపికలు అందజేస్తారు.
వారం రోజుల పాటు వేడుకలు
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురసరించుకొని జీహెచ్ఎంసీ పరిధిలోని జోనల్ సరిల్ స్థాయిలో కల్చరల్, స్పోర్ట్స్ , హెల్త్ క్యాంపులు, అవగాహన కార్యక్రమాలను వారం రోజుల పాటు నేటి నుంచి 15వ తేదీ వరకు నిర్వహించాలని కమిషనర్ జోనల్, సరిల్ స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
- 8వ తేదీన జోనల్ సరిల్ స్థాయిలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు.
- 9న మహిళా ఉద్యోగులు శానిటేషన్ సిబ్బందితో ఆరోగ్య, మహిళా భద్రతపై అవగాహన కల్పిస్తారు. టీఎల్ఎఫ్ స్వయం సహాయక సంఘాల మహిళలు టౌన్ లెవెల్ ఫెడరేషన్లతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి వారికి హెల్త్ న్యూట్రిషన్ జండర్
కమిటీలను ఆక్టివేట్ చేస్తారు. - 10న హెల్త్ హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తారు. అందులో మహిళా ఉద్యోగులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తారు. షెల్టర్ హోమ్స్‌లో ఉన్న వారికి కంటి వెలుగు క్యాంపులపై అవగాహన కల్పించనున్నారు.
- 11న స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన వస్తువులతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తారు. అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్ పై పోలీస్ ఎన్జీవోలు జ్యూడిషరీ సబ్జెక్ట్ నిష్ణాతులతో సమావేశాలు, చర్చలు, ఉపన్యాస కార్యక్రమాలు నిర్వహిస్తారు.
- 12న ఎస్‌హెచ్‌జీ తయారు చేసిన వస్తువులను విక్రయించేందుకు వివిధ ప్రదేశాల్లో స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. అలాగే మహిళా షెల్టర్ హోమ్స్‌లో పండ్లు పంపిణీ చేయనున్నారు.
- 13న బ్యాంకు లింకేజ్ కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాలకు రుణాల పంపిణీ, బెస్ట్ ఉమెన్ స్ట్రీట్ వెండర్స్‌కు సన్మానం చేస్తారు.
- 14న మహిళా ఉద్యోగులు, ఎస్‌హెచ్‌జీ మహిళలు ఎన్జీవో శానిటేషన్ మహిళా సిబ్బందికి క్రీడా పోటీలు సరిల్, జోనల్స్ వారీగా నిర్వహిస్తారు.
- 15న సాంస్కృతిక కార్యక్రమాలను మహిళా ఉద్యోగులు, ఎస్‌హెచ్‌జీ, ఎన్జీవో శానిటేషన్ సిబ్బందితో నిర్వహిస్తారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

