సిటీబ్యూరో, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో ఎండలు భగ్గుమంటున్నాయి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువగా నమోదవుతుండటంతో ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 37.8డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 25.8డిగ్రీలు, గాలిలో తేమ 30శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.