బంజారాహిల్స్,అక్టోబర్ 28: సీఎం రేవంత్‌రెడ్డి బలపర్చిన జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్యాదవ్ను ఓడిస్తామని మాల సంఘాల జేఏసీ చైర్మన్ డా. మందాల భాస్కర్ తెలిపారు. మంగళవారం రహ్మత్‌నగర్ డివిజన్ పరిధిలోని కార్మికనగర్, ఎస్పీఆర్ హిల్స్ తదితర ప్రాంతాల్లో మాల సంఘాల జేఏసీ నేతలు ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ..రెండేళ్లుగా మాలల సమస్యలపై సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదన్నారు. 40 లక్షల మంది ఉన్న మాలలకు కేవలం 5 శాతం మాత్రమే రిజర్వేషన్లు కేటాయించి తీరని అన్యాయం చేసిన సీఎంకు గుణపాఠం చెప్పేందుకు మాలల జేఏసీ తరపున జూబ్లీహిల్స్‌లో అభ్యర్థిగా బాలకిషన్‌ను నిలబెట్టామన్నారు. నేతలు చెరుకు రాంచందర్, నర్సయ్య, రాహుల్‌రావు, మల్లేశ్, కొప్పు అర్జున్, శ్రీకాంత్ పాల్గొన్నారు.