ఆంజనేయ స్వామి ఆలయం లేని గ్రామం లేదు..ప్రభుత్వ పథకం అందని గడపా లేదు
రంగారెడ్డి- పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా ప్రతి ఎకరాకు సాగునీరుతో పాటు తాగునీరు అందించడానికి కృషి చేస్తానని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
- రంగారెడ్డి- పాలమూరు ఎత్తి పోతల పథకం ద్వారా ప్రతి ఎకరాకు నీరు
- ముచ్చర్ల వరకు మెట్రో తీసుకువస్తా
- కందుకూరుపై సీఎం కేసీఆర్‌కు ప్రేమ
- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గ్రామంలో బీఆర్ఎస్కు బ్రహ్మరథం
- రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
కందుకూరు. నవంబర్ 20: రంగారెడ్డి- పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా ప్రతి ఎకరాకు సాగునీరుతో పాటు తాగునీరు అందించడానికి కృషి చేస్తానని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సోమవారం మండల పరిధిలోని సరస్వతీగూడ, అగర్ మియాగూడ, తిమ్మాపూర్, జబ్బార్‌గూడ, బేగంపేట, రాచులూరు, బైరాగిగూడ, కొత్తూరు గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆంజనేయ స్వామి దేవాలయం లేని గ్రామం ఉండదన్నారు. ప్రభుత్వ పథకాలు అందని గడప లేదని చెప్పారు. తాను స్థానికురాలని కాదని బీజేపీ నాయకులు అంటున్నారని, మీ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్థానికుడా.. అని ప్రశ్నించారు. కిషన్‌రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి ఎందుకు పోటీ చేశాడో తెలుపాలన్నారు. సీఎం కేసీఆర్‌కు కందుకూరు అంటే ప్రేమ ఉన్నదని చెప్పారు. ముచ్చర్ల గేటు వరకు మెట్రోతో పాటు మెడికల్ కళాశాల, 450 పడకల ఆసుపత్రి కావాలంటే తనను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చే హమీలను నమ్మితే మోసపోతారని , కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోను నమ్మవద్దని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ర్టాన్ని అమ్ముకుంటారని మంత్రి ఎద్దెవ చేశారు. కాంగ్రెస్, బీజేపీ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, మీ సేవకురాలుగా పని చేస్తానని చెప్పారు. 30వ తేదీన కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తే మరిన్ని సేవలు చేస్తానన్నారు. పొరపాటున ప్రతి పక్షాలకు ఓటు వేస్తే గోస పడుతారని వివరించారు.
కిషన్‌రెడ్డి స్వగ్రామంలో బీఆర్ఎస్కు బ్రహ్మరథం..
కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం కిషన్‌రెడ్డి స్వగ్రామం తిమ్మాపూర్‌లో ప్రజలు బీఆర్ఎస్కు బ్రహ్మరథం పట్టారు. మహిళలు, పురుషులు. యువకులు పెద్ద ఎత్తున కేరింతలు, బతుకమ్మ ఆటలు ఆడుకుంటూ పూలవర్షం కురిపించారు. పటాకులు కాలుస్తూ స్వాగతం పలికారు. మంత్రి గ్రామంలో కలియ తిరిగారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కమిషన్ మాజీ సభ్యులు చిలకమర్రి నర్సింహ, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మార్కెట్ చైర్మన్ సురుసాని సురేందర్‌రెడ్డి, సీఏసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్, వైస్ చైర్మన్ గోపిరెడ్డి విజేందర్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్‌రెడ్డి, సీనియర్ నాయకులు గంగాపురం లక్ష్మీనర్సింహరెడ్డి, వట్నాల ఈశ్వర్‌గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్, ఎలుక మేఘనాథ్‌రెడ్డి, మహిళా అధ్యక్షురాలు తాండ్ర ఇందిరమ్మ దేవేందర్, మాజీ ఎంపీపీ వట్నాల శోభ ఈశ్వర్‌గౌడ్, చిర్ర సాయిలు, గంగాపురం కవిత కరుణాకర్‌రెడ్డి, ఆనేగౌని అంజయ్యగౌడ్, సర్గారి బాల్‌రెడ్డి, గణేశ్ రెడ్డి, సర్పంచులు రాము, భూపాల్‌రెడ్డి, పరంజ్యోతి, గంగాపురం గోపాల్‌రెడ్డి, వరికుప్పల గోవర్ధన్, శ్రీనివాసచారి, రామకృష్ణారెడ్డి, నరేందర్‌గౌడ్, దావుద్, అర్జున అవార్డు గ్రహీత వెదిరె రవికాంత్‌రెడ్డి, సదానంద్‌గౌడ్, గుయ్యని సామయ్య, డైరెక్టర్ పొట్టి ఆనంద్, దేవీలాల్, యూత్ నాయకులు తాళ్ల కార్తీక్, బొక్క దీక్షిత్‌రెడ్డి, సరికొండ వెంకటేశ్‌గౌడ్, శేఖర్‌గుప్తా, శివశంకర్, రవి ముదిరాజ్, బేతు రాంరెడ్డి, శ్రీను, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

