హైదరాబాద్: నిరసనలు, నిలదీతల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం రాష్ట్రం ప్రభుత్వం ఈ నెల 24 వరకు గ్రామ, వార్డు సభలు (Ward Sabha) నిర్వహిస్తున్నది. ఈ సందర్భంగా నాలుగు పథకాల కోసం దరఖాస్తులు స్వీకరించడంతోపాటు లబ్ధిదారులను ఎంపిక చేయనుంది. అయితే జీహెచ్ఎంసీలో మాత్రం ఈ కార్యక్రమం ప్రారంభం కాకపోవడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభల సందడి నెలకొన్నా.. హైదరాబాద్ వార్డుల్లో మాత్రం కానరావడంలేదు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల్లో లబ్ధిదారులను గుర్తించేదుకు జీహెచ్ఎంసీ పరిధిలో అధికారులు సర్వే చేపట్టారు. అయితే కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులపై సర్వే ఇంకా ముగియక పోవడంతోనే వార్డు సభలు ప్రారంభం కాకపోవడానికి కారణంగా తెలుస్తున్నది. దీంతో గ్రేటర్లో జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల జారీపై సందిగ్ధత నెలకొన్నది. కాగా, ఈ నెలాఖరు నాటికి సర్వే పూర్తి చేసి ఫిబ్రవరి 1 నుంచి వార్డు సభలు నిర్వహించాలని అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
గ్రామ సభల్లో అధికారులను నిలదీస్తున్న ప్రజలు – 3
కోదాడ మండలం గుడిబండ గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో ప్రజల ఆందోళన
రేషన్ కార్డుల జాబితాలో తమ పేరు లేదని, తమకు ఇందిరమ్మ ఇళ్లు రాలేదని ప్రజల ఆందోళన https://t.co/dRW4xbCu4L pic.twitter.com/ymesseLvqf
— Telugu Scribe (@TeluguScribe) January 21, 2025