హిమాయత్‌నగర్,ఫిబ్రవరి25: యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి వారి బంగారు జీవితాన్ని నాశనం చేసుకోకుండా వీటికి వ్యతిరేకంగా యువత ఉద్యమించాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలిఉల్లాఖాద్రీ, రాష్ట్ర కార్యదర్శి కల్లూరి ధర్మేంద్ర పిలుపు నిచ్చారు. భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్దేవ్ల 95వ వర్థంతి సందర్భంగా మార్చి 1వ తేదీ నుంచి 23వ తేదీ వరకు యువజనోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆ ఉత్సవాలకు సంబం ధించిన వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం హిమాయత్‌నగర్‌లోని ఎస్ ఎన్రెడ్డి భవన్లో జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భగత్‌సింగ్ ఆలోచ నలు,ఆయన చూపిన కార్యచరణను యువతకు తెలియజేయాలనే సంకల్పంతో క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, వ్యాసరచన, చిత్రలేఖన, ఉపన్యాస పోటీలతో పాటు రక్తదాన శిబిరాలు, మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలు, కవి గాయకుల సమ్మేళనం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భగత్‌సింగ్ కలలుగన్న స్వరాజ్య ఆకాంక్షలను అనుగుణంగా యవత ముందడగు వేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు ఎన్.శ్రీకాంత్, నేతలు టి.సత్యప్రసాద్, షేక్ మహ మూద్, సల్మాన్‌బేగ్, మహేష్, శివకుమార్, సురేందర్ పాల్గొన్నారు.