సిటీబ్యూరో, జూన్17, (నమస్తే తెలంగాణ): ఇప్పటివరకు విద్యార్థులకు అందించాల్సిన యూనిఫార్మ్, పాఠ్యపుస్తకాలు అందాయా అని కలెక్టర్ హరిచందన విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మంగళవారం అధికారులతో కలిసి బంజారా హిల్స్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆమె తనిఖీ చేశారు. పాఠశాలలోని టాయిలెట్, హ్యాండ్‌వాష్ పరిశీలించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.
ప్రాథమిక, ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు సరిపడా సిబ్బంది ఉన్నారా అని అడిగారు. పాఠశాల నేమ్ బోర్డు రాయించాలని సూచించారు. పాఠశాలలోని 1వ తరగతి, 4వ తరగతి క్లాస్ రూమ్‌లను సందర్శించి పిల్లలతో టెక్ట్స్‌బుక్స్ ను చదివించారు. ఆమె వెంట డీఈవో రోహిణి, డిప్యూటీ ఈవో శామ్యూల్ రాజ్, మల్లయ్య తదితరులు ఉన్నారు.