Hyderabad Police | నిన్ను ఇంటి దగ్గర దింపాలని రూల్ ఉందా.. హైదరాబాద్ పోలీసుల తీరుపై విజయవాడ యువతి ఆవేదన
Hyderabad Police | హైదరాబాద్ పోలీసుల తీరుపై ఓ యువతి అసహనం వ్యక్తం చేసింది. అర్ధరాత్రి వేళ లింగంపల్లి రైల్వే స్టేషన్లో ఒంటరిగా ఉండి భయాందోళనతో పోలీసుల సాయం కోరితే.. వారు ఇచ్చిన సమాధానం తీవ్ర నిరాశకు గురి చేసిందని బాధపడింది.
Hyderabad Police | హైదరాబాద్ పోలీసుల తీరుపై విజయవాడకు చెందిన ఓ యువతి అసహనం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి వేళ లింగంపల్లి రైల్వే స్టేషన్లో ఒంటరిగా ఉండి భయాందోళనతో పోలీసుల సాయం కోరితే.. వారు ఇచ్చిన సమాధానం తీవ్ర నిరాశకు గురి చేసిందని బాధపడ్డారు. ఈ మేరకు తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్మీడియాలో పంచుకున్నారు. అర్ధరాత్రి ఒక అమ్మాయి ఒంటరిగా ఉండి, అన్సేఫ్గా ఫీలయ్యి.. పోలీసులను హెల్ప్ అడిగితే.. హెల్ప్ చేయాలనే రూల్ ఉందా? లేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ గురించి, హైదరాబాద్ పోలీసు గురించి నాలెడ్జ్ ఉన్నవాళ్లు ప్లీజ్ నాకు చెప్పండని కోరారు. అది కాస్త వైరల్గా మారింది.
ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..
‘ జూన్ 6వ తేదీ గురువారం లింగంపల్లి ఇంటర్సిటీ ట్రైన్ ఎక్కాను. రాత్రి 11.30 గంటలోపు ఆ రైలు లింగంపల్లికి రావాలి. కానీ ఆ రైలులో సమస్య కారణంగా బీబీ నగర్లో రెండు గంటల పాటు ఆపేశారు. దీంతో రైలు లింగంపల్లికి వచ్చే సరికి 1.45 అయ్యింది. ఆ సమయంలో ర్యాపిడో బుక్ చేసుకోవడానికి భయం వేసింది. ఆ రోడ్డు మొత్తం ఫారెస్ట్లా ఉండటంతో నాకు భయమేసి, ఎవరికి కాల్ చేయాలో అర్థంకాక పోలీసులకు కాల్ చేశాను. హెల్ప్ చేయమని అడిగాను. కానీ వాళ్ల నుంచి వచ్చిన రియాక్షన్కు షాకయ్యాను. అలా డ్రాప్ చేయాలని రూల్ ఏమైనా ఉందా అని ప్రశ్నించారు‘ అని చెప్పి ఆ వీడియోలో యువతి ఆవేదన వ్యక్తం చేశారు.
అసలు ఆ సమయంలో పోలీసులకే ఎందుకు ఫోన్ చేయాలని అనిపించిందో కూడా యువతి వివరించారు. ‘ అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు ఎవరైనా అమ్మాయి అన్సేఫ్గా ఫీలయితే పోలీసులకు కాల్ చేయవచ్చని, అప్పుడు పోలీసులు వచ్చి డ్రాప్ చేస్తారని ఆ మధ్య ఒక ప్రచారం చూశా. కానీ నాకు ఎప్పుడూ ఆ సమస్య రాలేదు. నిన్న అవసరం వచ్చింది కాబట్టి అది గుర్తొచ్చి పోలీసులకు ఫోన్ చేశా. కానీ వారి దగ్గర నుంచి అలాంటి రియాక్షన్ రావడంతో నిజంగా బాధేసింది.‘ అని తెలిపింది. ఇప్పుడు నాకు తెలియాల్సిన విషయమేంటంటే.. ఆ సర్క్యూలేట్ మిస్టేకా? నేనే పొరపాటు పడ్డానా? పోలీసులే ఇగ్నోర్ చేశారా చెప్పండి అని సోషల్మీడియా వేదికగా ప్రశ్నించారు.
హైదరాబాద్ పోలీసుల తీరుపై ఓ యువతి అసహనం
తాను విజయవాడ నుండి వస్తున్న ట్రైన్ లేట్ అవ్వడం వల్ల అర్ధరాత్రి 1:45 గంటలకు లింగంపల్లి రైల్వే స్టేషన్లో దిగానని, భయం వేసి పోలీసులకు ఫోన్ చేసి ఇంటి వద్ద దింపాలని అడిగానని తెలిపిన యువతి
అయితే నిన్ను ఇంట్లో దింపాలని ఎక్కడా రూల్ లేదని పోలీసుల… pic.twitter.com/fs0vjvZSs1
— Telugu Scribe (@TeluguScribe) June 8, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

