Garividi Lakshmi OTT | ఓటీటీలోకి వస్తున్న ‘గరివిడి లక్ష్మి’.. ఆనంది నటించిన బయోపిక్ ఎక్కడ చూడొచ్చంటే?
Garividi Lakshmi OTT | 1980, 90వ దశకాల్లో తన జానపద పాటలు, బుర్రకథలు, కథాగానంతో ఉత్తరాంధ్ర ప్రజలను అలరించిన ప్రముఖ జానపద కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘గరివిడి లక్ష్మి’. టాలీవుడ్ నటి ఆనంది టైటిల్ రోల్లో నటించిన ఈ సినిమా అక్టోబర్ 17న థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే డిజిటల్ ప్లాట్ఫామ్లో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.
Garividi Lakshmi OTT | 1980, 90వ దశకాల్లో తన జానపద పాటలు, బుర్రకథలు, కథాగానంతో ఉత్తరాంధ్ర ప్రజలను అలరించిన ప్రముఖ జానపద కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘గరివిడి లక్ష్మి’. టాలీవుడ్ నటి ఆనంది టైటిల్ రోల్లో నటించిన ఈ సినిమా అక్టోబర్ 17న థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే డిజిటల్ ప్లాట్ఫామ్లో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం ‘గరివిడి లక్ష్మి’ సినిమా నవంబర్ 13, శుక్రవారం నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఓటీటీ విడుదల తేదీ, స్ట్రీమింగ్కు సంబంధించిన వివరాలపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అధికారిక ప్రకటన వెలువడితే సినిమా డిజిటల్ రిలీజ్‌పై మరింత స్పష్టత రానుంది.
ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లా గరివిడి గ్రామానికి చెందిన జానపద కళాకారిణి లక్ష్మి జీవితంలోని సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. చిన్న వయసులోనే వివాహం చేసుకున్న లక్ష్మి, భర్తకు అప్పటికే మరో పెళ్లి జరిగిందని తెలుసుకుని జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ పరిస్థితుల్లో ఆమె తల్లి దేవుడమ్మ తన కూతురికి అండగా నిలుస్తుంది. ఆ తర్వాత లక్ష్మికి బుర్రకథలు, జానపద పాటలపై ఆసక్తి పెరుగుతుంది. సత్తిబాబు పరిచయంతో అతడితో కలిసి ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభిస్తుంది. తన గాత్రంతో, కథాగానంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ క్రమంగా మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. అయితే ఆమె జీవితంలో పేరు ప్రఖ్యాతులతో పాటు అనేక చేదు అనుభవాలు కూడా ఎదురవుతాయి.
లక్ష్మి జీవితంలో సత్తిబాబు పాత్ర ఎలాంటి మలుపులు తీసుకొచ్చింది? ప్రేమ పేరుతో అతడు ఆమెను ఎలా మోసం చేశాడు? ఆమె పాడిన పాటలు, సంపాదించుకున్న గుర్తింపును ఇతరులు ఎలా సొంతం చేసుకున్నారు? కళాకారిణిగా ఎదిగిన లక్ష్మి వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు ఏమిటి? అనే అంశాలను ఈ సినిమాలో చూపించారు.అంతేకాదు, లక్ష్మికి తిరిగి గుర్తింపు తీసుకురావడానికి రాంబాబు చేసిన ప్రయత్నాలు, ఆమె జీవితంలో చోటుచేసుకున్న పరిణామాలు కథలో కీలకంగా నిలుస్తాయి. ఒక జానపద కళాకారిణి ప్రయాణం, ఆమె పోరాటం, కళకు దక్కాల్సిన గౌరవం వంటి అంశాలను ఈ చిత్రం తెరపై ఆవిష్కరించింది. ఈ సినిమాలో ఆనంది గరివిడి లక్ష్మిగా ప్రధాన పాత్ర పోషించగా, సీనియర్ నటి రాశి ఆమె తల్లి దేవుడమ్మ పాత్రలో కనిపించారు. వీకే నరేశ్, రాగ్ మయూర్, శరణ్య ప్రదీప్, అంకిత్ కొయ్య, మీసాల లక్ష్మణ్, కంచరపాలెం కిషోర్, కుశాలిని తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Garividi Lakshmi OTT | ఓటీటీలోకి వస్తున్న ‘గరివిడి లక్ష్మి’.. ఆనంది నటించిన బయోపిక్ ఎక్కడ చూడొచ్చంటే?
Perni Nani | ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చంద్రబాబు : మాజీ మంత్రి పేర్నినాని
‘తాగునీటి భద్రతకు అత్యంత ప్రాధాన్యం’
Rahul Gandhi: దిమాగీ నక్సల్స్ వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ కౌంటర్
Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యకు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

