కేపీహెచ్‌బీ కాలనీ, నవంబర్ 6 : కేపీహెచ్‌బీ కాలనీలో గుంతల రోడ్లతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నా జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదని బాలాజీనగర్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు జి.వినోద్‌కుమార్ గౌడ్ అన్నారు. గురువారం కేపీహెచ్‌బీ కాలనీ మొదటి రోడ్డులో గుంతల రోడ్లను బాగుచేయాలని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవడంలేదన్నారు.
చిన్న వర్షం పడిన రోడ్లపై ప్రయాణాలు చేయలేని పరిస్థితుల నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలు పొతున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ప్రజల కష్టాలను దృష్టిలో పెట్టుకుని వెంటనే రోడ్లను బాగుచేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, గుప్త తదితరులు ఉన్నారు.