శంషాబాద్ రూరల్: బహదూర్‌గూడ గ్రామంలో బుల్లెట్ ట్రైన్ కోసం సర్వే బృందం సభ్యులు నిర్వహిస్తున్న భూ సర్వేను బుధవారం గ్రామస్తులు, రైతులు అడ్డుకున్నారు. బహదూర్‌గూడ గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 28లో 150 ఎకరాలు, సర్వే నంబర్ 62లో 500 ఎకరాల భూమి మొత్తంగా 650 ఎకరాలను గత ప్రభుత్వాలు రైతులకు సాగు చేసుకోవడానికి ఇచ్చాయి.
ఇప్పుడు ఆయా భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే క్రమంలో సర్వే బృందాలు వచ్చాయనే విషయం తెలియడంతో రైతులు అడ్డుకున్నారు. సర్వేను నిలిపివేయాలని శంషాబాద్ తహసీల్దార్‌కు రైతులు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. తహసీల్దార్ సర్వే నిలిపివేయాలని ఫోన్లో ఆదేశాలు జారీ చేయడంతో సంబంధిత బృందం సర్వే నిలిపివేసి వెళ్లిపోయింది.