నాణ్యమైన విత్తనాలు అందించాలి
ముందస్తు ప్రణాళికతో రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనాలు అందే విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు.
- ముందస్తు ప్రణాళికలతో సకాలంలో సిద్ధం చేయాలి
- రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
- వ్యవసాయ, పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్
మామిళ్లగూడెం, మే 16 : ముందస్తు ప్రణాళికతో రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనాలు అందే విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు. వానకాలం వ్యవసాయ సీజన్ ముందస్తు ఏర్పాట్లపై హైదరాబాద్ నుంచి డీజీపీ అంజనీకుమార్, రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావుతో కలిసి జిల్లాల వ్యవసాయ, పోలీసు శాఖల అధికారులతో మంగళవారం నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. రైతులకు ఇబ్బందులు రాకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించుకొని నాణ్యమైన ఎరువులు, విత్తనాలు సమయానికి అందించాలని, పంట దిగుబడి అధికంగా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. వానకాలం సీజన్‌కు సంబంధించి రైతులకు అవసరమైన మేరకు విత్తనాలు, ఎరువులను స్టాక్ ఉంచుకోవాలని అన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన వైఖరి కారణంగా ప్రస్తుత కాలంలో నకిలీ విత్తనాలు మారెట్లో దాదాపు కనుమరుగయ్యాయని అన్నారు. క్షేత్రస్థాయిలో సమాచారం సేకరించి పక రాష్ట్రాల నుంచి వచ్చే నకిలీ విత్తనాలు, ఎరువులపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. దేశంలో ఉన్న విత్తన అవసరాల్లో దాదాపు 60 శాతం తెలంగాణ నుంచే సరఫరా చేస్తున్నామని అన్నారు. నకిలీ విత్తనాలపై ఉకుపాదం మోపాలని, అవి ఇతర రాష్ట్రాల నుంచి రాకుండా సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిఘా పెంచాలని మంత్రి సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్సలో అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్, అదనపు డీసీపీ బోస్, డీఏవో విజయనిర్మల, డీహెచ్‌ఎస్‌వో అనసూయ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

