హైదరాబాద్ : మూసీ లాంటి పెద్ద ప్రాజెక్టుకు డీపీఆర్ లేదు.. ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ముక్కలు ముక్కలుగా చూపిస్తూ ప్రజలను గందరగోళంలోకి నెడుతున్నారని పలువురు వక్తలు ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మూసీ బాధితులు ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏమో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుండి లోన్ వచ్చింది, మూసీ పనులు స్టార్ట్ చేయబోతున్నామని అంటున్నారు.
ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అధికారులు ఏమో ఇంతవరకు మేము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్తున్నారు. ప్రభుత్వం ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. మూసీ చుట్టుపక్కల ఉన్న ఇళ్ల పైకి ఈ ప్రభుత్వం వస్తే.. కాంగ్రెస్ నాయకుల ఇళ్లపైకి మేము వెళ్తాం. ఎలాగైతే రైతుల ఆందోళనలు, నదుల పరిరక్షణకు ఆందోళనలు జరిగాయో అలా కాంగ్రెస్ నాయకుల ఇంటి ముందు నిలబడి ఆందోళనలు చేస్తామని మూసీ బాధితులు హెచ్చరించారు. మా ఇండ్లు మూసీ బఫర్ జోన్లో ఉండి డేంజర్లో ఉన్నాయని మమ్మల్ని పంపాలి అని చూస్తున్నారు.
మమ్మల్ని పంపాక అక్కడ కట్టే పెద్ద పెద్ద బిల్డింగులు బఫర్ జోన్లోకి రావా? ఆ బిల్డింగులు డేంజర్లో ఉండవా? అని సూటిగా ప్రశ్నించారు. ఇల్లు అనేది ఒక కల.. అలాంటి ఇల్లును కూల్చేస్తామంటే ఎలా? ఢిల్లీ నుండి హైదరాబాద్ కోడలిగా వచ్చాను.. ఈరోజు మా ఇల్లు కోసం రోడ్ల మీదకి ఎక్కే దుస్తితి వచ్చిందని ఓ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడి ఇండ్లను కాపాడుకుంటామన్నారు.
మూసీ చుట్టుపక్కల ఉన్న ఇళ్ల పైకి ఈ ప్రభుత్వం వస్తే.. కాంగ్రెస్ నాయకుల ఇళ్లపైకి మేము వెళ్తాం
ఎలాగైతే రైతుల ఆందోళనలు, నదుల పరిరక్షణకు ఆందోళనలు జరిగాయో అలా కాంగ్రెస్ నాయకుల ఇంటి ముందు నిలబడి ఆందోళనలు చేస్తాం – మూసీ బాధితులు https://t.co/6PapxZzJL9 pic.twitter.com/EA5zgTK7ow
— Telugu Scribe (@TeluguScribe) February 18, 2026
ప్రభుత్వం ఏమో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుండి లోన్ వచ్చింది, మూసీ పనులు స్టార్ట్ చేయబోతున్నామని అంటున్నారు
ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అధికారులు ఏమో ఇంతవరకు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మాకు లేఖ రాశారు, చెప్పారు కూడా
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుండి ప్రపోజల్ వస్తే ADB… https://t.co/URgUPL391B pic.twitter.com/NGCjXQoLnD
— Telugu Scribe (@TeluguScribe) February 18, 2026