మహిళలపై పెరుగుతున్న వేధింపులు
మహిళలపై వేధింపులు పెరుగుతున్నాయి. మల్కాజిగిరి షీ టీమ్స్‌కు నెలకు 200 వరకు ఫిర్యాదులు అందుతున్నాయి. డెకాయి అపరేషన్లు నిర్వహిస్తున్నా పోకిరీలలో భయం లేకుండా పోతుందని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
- షీ టీమ్స్‌ను ఆశ్రయిస్తున్న బాధితులు
సిటీబ్యూరో, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): మహిళలపై వేధింపులు పెరుగుతున్నాయి. మల్కాజిగిరి షీ టీమ్స్‌కు నెలకు 200 వరకు ఫిర్యాదులు అందుతున్నాయి. డెకాయి అపరేషన్లు నిర్వహిస్తున్నా పోకిరీలలో భయం లేకుండా పోతుందని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాలలో వేధింపులు పెరగడం, రోడ్లపైనే పోకిరీల యధేచ్చగా వేధింపులకు పాల్పడుతున్నారని పలువురు చర్చించుకుంటున్నారు.
మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో డెకాయి అపరేషన్లతో పట్టుబడుతున్న పోకిరీలలో చాలామందికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తున్నారు. షీ టీమ్స్‌కు వస్తున్న ఫిర్యాదులలో ఫోన్, సోషల్ మీడియాతో పాటు నేరుగా వచ్చి ఫిర్యాదు చేస్తున్న వారు ఉంటున్నారు.
కేసులు నమోదు
షీ టీమ్స్‌కు వస్తున్న ఫిర్యాదులలో ఆయా కేసుల తీవ్రతను బట్టి కేసులు నమోదు చేస్తున్నారు. ఫిర్యాదులపై విచారణ జరిపి కేసులు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేస్తున్నారు. వేధింపులలో ఎక్కువగా తెలిసిన వారే ఉంటున్నారు, తెలిసిన వారి ద్వారానే బాధితులు ఎక్కువగా వేధింపులకు గురవుతున్నట్లు దర్యాప్తులో బయటపడుతున్నది. మహిళలు వేధింపులపై మౌనంగా ఉండవద్దని, ధైర్యంగా వచ్చి షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచనలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతున్నట్లు మల్కాజిగిరి మహిళా భద్రత డీసీపీ ఉషారాణి వెల్లడించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

