manne krishank | భూ భారతి పేరిట కాంగ్రెస్ నాయకులు అసైన్డ్ భూములు కొల్లగొడుతున్నారని బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిషాంక్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న అసైన్డ్ భూముల్లో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి మైనింగ్ చేస్తున్నాడన్నారు. 2010లో, 2015లో వేం నరేందర్ రెడ్డి ఎలక్షన్ అఫిడవిట్లో అసైన్డ్ భూముల గురించి ఎక్కడా లేదు.. కానీ 2026లోని ఎలక్షన్ అఫిడవిట్లొ వాటి వివరాలున్నాయన్నారు. వేం నరేందర్ రెడ్డి భార్య విజయ లక్ష్మి పేరు మీద ఉన్న శ్రీ సాయి కృష్ణ గ్రానైట్స్ కంపెనీ కింద ఈ భూములు ఉన్నాయి.
అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న అసైన్డ్ భూముల సర్వే నంబర్, శ్రీ సాయి కృష్ణ గ్రానైట్స్ కంపెనీ ఉన్న భూములు ఒకటే సర్వే నంబర్ కింద ఉన్నాయని స్పష్టం చేశారు. అవి అసైన్డ్ భూములని ఆర్డీవో, అడిషనల్ కలెక్టర్, కలెక్టర్ సంతకాలు కూడా ఉన్నాయి. ఇందులో కచ్చితంగా పాత మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ప్రాత్ర కూడా ఉందని.. అందుకే వేం నరేందర్ రెడ్డి రాజ్య సభకి పోతు.. నువ్వు కూడా నా వెంట రా అని కలెక్టర్‌కి ఢిల్లీలోని తెలంగాణ భవన్లో స్పెషల్ సెక్రటరీ పదవి ఇప్పించాడని మన్నె క్రిషాంక్ ఆరోపించారు.
వేం నరేందర్ రెడ్డి అక్రమంగా అసైన్డ్ భూములు కాజేస్తున్నాడు. తన కొడుకు వేం కృష్ణ భార్గవ్ రెడ్డి పేరిట అక్రమంగా అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాడని భూ భారతి ద్వారా అన్ని ఆధారాలు సేకరించానని మన్నె క్రిశాంక్ తెలిపారు.
అక్రమంగా అసైన్డ్ భూములు కాజేస్తున్న కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి
తన కొడుకు వేం కృష్ణ భార్గవ్ రెడ్డి పేరిట అక్రమంగా అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాడు
భూ భారతి ద్వారా అన్ని ఆధారాలు సేకరించాను
– బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిషాంక్ pic.twitter.com/rcwWCza6tI
— Telugu Scribe (@TeluguScribe) May 19, 2026
భూ భారతి పేరిట అసైన్డ్ భూములు కొల్లగొడుతున్న కాంగ్రెస్ నాయకులు
అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న అసైన్డ్ భూముల్లో వేం నరేందర్ రెడ్డి మైనింగ్ చేస్తున్నాడు
2010లో, 2015లో వేం నరేందర్ రెడ్డి ఎలక్షన్ అఫిడవిట్లో అసైన్డ్ భూములు గురించి ఎక్కడా లేదు.. కాని 2026లోని ఎలక్షన్ అఫిడవిట్లో… https://t.co/MGQqpXk9KX pic.twitter.com/aRA611iAaz
— Telugu Scribe (@TeluguScribe) May 19, 2026