e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home News అన‌వ‌స‌రంగా రోడ్ల‌పైకి వ‌చ్చే వాహ‌నాల‌ను సీజ్ చేస్తాం: సీపీ

అన‌వ‌స‌రంగా రోడ్ల‌పైకి వ‌చ్చే వాహ‌నాల‌ను సీజ్ చేస్తాం: సీపీ

అన‌వ‌స‌రంగా రోడ్ల‌పైకి వ‌చ్చే వాహ‌నాల‌ను సీజ్ చేస్తాం: సీపీ

హైద‌రాబాద్‌: న‌గ‌ర ప్ర‌జ‌లంతా లాక్‌డౌన్‌కు స‌హ‌క‌రించాల‌ని హైద‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ అంజ‌నీ కుమార్ కోరారు. త‌ప్పుడు ప‌త్రాల‌తో రోడ్ల‌పై తిరిగితే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. అన‌వ‌స‌రంగా రోడ్ల‌పైకి వ‌చ్చే వాహ‌నాల‌ను సీజ్ చేస్తామ‌న్నారు. న‌గ‌రంలో లాక్‌డౌన్ అమ‌లు తీరును సీపీ ప‌రిశీలించారు. ఇందులో భాగంగా దిల్‌సుఖ్‌న‌గ‌ర్ చెక్‌పోస్టును ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో 180 త‌నిఖీ కేంద్రాల‌ను ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. లాక్‌డౌన్ స‌మ‌యంలో మిన‌హాయింపులు పొందిన‌వారికే త‌నుమ‌తిస్తామ‌ని చెప్పారు. అత్య‌వ‌స‌ర‌మైన వారికి ఈ-పాస్‌లు అందిస్తున్నామ‌ని అన్నారు.

ఉదయం 10 గంటల తర్వాత అనవసరంగా బయటకు వస్తే వాహనాల్ని సీజ్ చేయాలని డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి ఆదేశించిన విష‌యం తెలిసిందే. లాక్‌డౌన్‌ను పటిష్ఠంగా అమలు చేసేందుకు కాలనీలు, అంతర్గత రహదారుల్లో పోలీసు నిఘా విస్తృతం చేయాలని సూచించారు. లాక్‌డౌన్‌ ఉల్లంఘించి తిరిగే వాహనాల జప్తు చేయాల‌న్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవికూడా చదవండి..
2 డోసుల ఆస్ట్రాజెనికా టీకాల‌తో 90 శాతం ర‌క్ష‌ణ : బ్రిట‌న్‌
పదో తరగతి ఫలితాలు విడుదల
ఇంట‌ర్నెట్ ఎక్స్‌ప్లోర‌ర్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన మైక్రోసాఫ్ట్‌
వాహనదారులకు షాక్‌.. మరోసారి పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు
300 మీట‌ర్ల ఎత్తున్న బిల్డింగ్ ఊగిపోయింది..
పంజాబ్‌లో కూలిన మిగ్‌-21 యుద్ధ విమానం
దేశంలో కాస్త తగ్గిన కరోనా ఉధృతి.. కొత్తగా 2.5 లక్షల పాజిటివ్‌ కేసులు
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అన‌వ‌స‌రంగా రోడ్ల‌పైకి వ‌చ్చే వాహ‌నాల‌ను సీజ్ చేస్తాం: సీపీ

ట్రెండింగ్‌

Advertisement