Dasoju Shravan Kumar | డిక్షనరీలో ఎక్కడా తెలంగాణ అనే పదం లేదని టీడీపీ మహానాడులో టీడీపీ నేత బక్కని నర్సింహులు చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్‌కుమార్ తనదైన శైలిలో చురకలంటించారు. ఆయనది షాద్నగరేనట. మరి షాద్‌నగర్‌లో పుట్టి తెలంగాణం లేదంటున్నడంటే ఆయన ఎవరి మెప్పు కోసం అడ్డదిడ్డంగా మాట్లాడిండో నాకు అర్థం కావడం లేదు. తెలంగాణం వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రాంతం. ఈ ప్రాంతానికి ఒక భాష ఉంది.. సంస్కతి ఉంది. సాహితీపరమైన చరిత్ర ఉంది. అది తెలువక పోతే తెలంగాణ గడ్డ మీద పుట్టినట్టు కాదు. బక్కని నర్సింహులు బహుజన బిడ్డ. నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడదలచుకోలేదు.
బావ కండ్లల్లో సంతోషం కోసం నేను తుపాకులు కాల్చిన వాడెవడో హంతకుడు అన్నట్టుగా.. తెలంగాణ అస్థిత్వంపైనే ఆత్మగౌరవంపై దాడి చేసినట్టుగా బక్కని నర్సింహులు చంద్రబాబు నాయుడునో ఆ వేదిక ముందు కూర్చున్న ఆంధ్రా పెద్దల కండ్లలో సంతోషం కోసం చిల్లర మల్లరగా మాట్లాడితే తెలంగాణ ద్రోహిగా ఆయన మిగిలిపోతరు. చరిత్రలో లేకుండా పోతరు. కానీ టీడీపీని అడుగుతున్నా.. బక్కని నర్సింహులు అనే వ్యక్తి తెలంగాణ తెలుగుదేశం శాఖ మాజీ అధ్యక్షుడు.. ఇక్కడి నుంచి ఆఫీసును తీసిపడేయ్. తెలంగాణ తెలుగుదేశం శాఖ అంటరు కదా.. మరి తెలంగాణ అనే పదాన్ని తీసేయాలని డిమాండ్ చేశాడు.
తెలంగాణ చరిత్రే లేదు.. ఆ గుర్తే లేదు. తెలంగాణ చరిత్రే.. ఆ పదమే లేదు.. అప్పుడెప్పుడో ఆనాడు స్పీకర్ యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో తెలంగాణ అనే పదమే ఉండొద్దంటే కేసీఆర్ పట్టుబట్టి చంద్రబాబుతో జై తెలంగాణ అనిపించిండు. ఏ అసెంబ్లీలోనైతే చంద్రబాబు మెప్పు కోసం యనమల రామకృష్ణుడు అన్నడో. ఇంత సత్యాలున్నా అట్లా మాట్లాడటం.. టీడీపీ అధినేత మేం తెలంగాణలో ఈ పార్టీతో పొత్తు పెట్టుకుంటాం. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటాం. జెండా ఎత్తుతం అని మాట్లాడుతున్న పెద్దలు.. మీరు తెలంగాణను ఇలా ప్రతీసారి అవమానపరిస్తే మీరు తగు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.
డిక్షనరీలో ఎక్కడా తెలంగాణ అనే పదం లేదని బక్కని నర్సింహులు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన దాసోజు శ్రవణ్
షాద్ నగర్లో పుట్టి తెలంగాణ పదం లేదు అంటున్నాడు అంటే ఎవరి మెప్పుకోసం అలా మాట్లాడిండో
తెలంగాణ చరిత్ర తెలియకపోతే తెలంగాణ గడ్డ మీద పుట్టినట్లు కాదు
చంద్రబాబు సంతోషం కోసం… https://t.co/RKsjq6wdiJ pic.twitter.com/TiJMDO6M6x
— Telugu Scribe (@TeluguScribe) May 27, 2026
డిక్షనరీలో ఎక్కడా తెలంగాణ అనే పదం లేదు
– బక్కని నర్సింహులు pic.twitter.com/cYHOO1dS9D
— Telugu Scribe (@TeluguScribe) May 27, 2026