కాలుష్య స్థాయిల పరీక్షకు ప్రత్యేక సాఫ్ట్వేర్

- రవాణా శాఖ సెంట్రల్ సర్వర్ ఆధారంగా ధ్రువపత్రం జారీ
- కాలుష్యాన్ని వెదజల్లే వాహనాలు రోడ్డెక్కకుండా చర్యలు
- నిర్ణీత ప్రమాణాలకు మించి కాలుష్యం వెదజల్లితే.. నంబరు ఆధారంగా వాహన అనుమతి రద్దు
రవాణాశాఖ సెంట్రల్ సర్వర్‌తో ప్రతి వాహన కాలుష్యం పరీక్ష యంత్రాన్ని అనుసంధానించి ఆన్లైన్ ద్వారా సిస్టం జనరేటెడ్ ధ్రువపత్రం వాహనదారులకు అందజేస్తున్నారు. ఒక వేళ పరీక్ష సెంటర్‌కు వచ్చిన వాహనం నిర్ణీత ప్రమాణాలకు మించి కాలుష్యం వెదజల్లితే నంబరు ఆధారంగా ఆటోమేటిక్‌గా సీజ్ చేస్తారు. పరీక్ష కేంద్రంలో పరిశీలన పూర్తయ్యాక ఆ రీడింగ్స్ సెంట్రల్ సర్వర్‌కు ఆటోమెటిక్‌గా వస్తాయి. అవి సరైనవిగా ఉంటే అక్కడి నుంచి పరీక్ష సెంటర్‌కు ఒకే అని ధ్రువపత్రం జనరేట్ అవుతుంది. ఒకవేళ రీడింగ్స్ సరైనవి కాకపోతే సర్టిఫికెట్ జనరేట్ కాదు. ఇలా కాలుష్యకారక వాహనాలకు చెక్ పడనుంది. అయితే చాలా మంది పీయూసీ ధ్రువపత్రం పొందకుండా రోడ్లపై తిరుగుతుంటారు. అలాంటి వాహన యజమానులకు రిజిస్టర్ మొబైల్ ఆధారంగా సందేశం వెళ్తుంది. కాలపరిమితికి కొద్ది రోజుల ముందే మీ వాహనం కాలుష్యం సర్టిఫికెట్ గడువు ముగియబోతుందని గుర్తు చేస్తూ సందేశాలు పంపిస్తుందని రవాణాశాఖకు చెందిన ఓ సీనియర్ ఆధికారి తెలిపారు. మరికొంతమంది వాహనదారులు ఎలాంటి కాలుష్య పరీక్ష లేకుండానే రోడ్లపై తిరుగుతున్నారు. ఎవరైతే నిర్ణీత క్రమంలో కాలుష్య పరీక్ష చేసుకుంటున్నారో.. చేసుకోవడం లేదో సాఫ్ట్వేర్ ఆధారంగా ఆ జాబితాను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతమున్న యంత్రాల స్థానంలో కొత్త యంత్రాలను బిగించుకోవాలని టెస్టింగ్ ఏజన్సీలకు ఇప్పటికే రవాణాశాఖ ఆదేశాలిచ్చింది. గ్రేటర్ హైదరాబాద్‌లో టెస్టింగ్ యంత్రాలు సుమారు 494 వరకు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

