Secunderabad | బేగంపేట్, ఆగస్టు 17: వివిధ కేసులలో పట్టుబడిన తొమ్మిది ద్విచక్ర వాహనాలను వేలం వేయనున్నట్టు సికింద్రాబాద్ ఎక్సైజ్ పోలీసులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 18వ తేదీన ఉయదం 11 గంటలకు సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్ ఆవరణలో ఈ వేలం పాటు ఉంటుందని, ఎక్సైజ్ సూపరిండెంట్ జి పంచాక్షరి సమక్షంలో ఈ వేలం పాటు కొనసాగుతుందని తెలిపారు.
ఆసక్తి ఉన్న వారు తమ ఆధార్ కార్డ్ కాపీ, పాన్‌కార్డ్ కాపీతో పాటు.. రూ.25 వేల నగదుతో, లేదా డీడీ రూపంలో ముందుగా జమచేసి వేలంలో పాల్గొనాలని చెప్పారు. వేలం పాటలో వాహనం పొందని వారికి ఈ నగదు తిరిగి చెల్లించబడుతుందని అన్నారు. మరిన్ని వివరాలకు 87126 59644 నెంబర్లో సంప్రదించాలని అన్నారు.