బాలానగర్ , మే 20 : అంతర్జాతీయ స్థాయిలో జేఎన్టీయూ ల్యాబ్‌ను రూపొందించనున్నట్లు వర్సిటీ వీసీ కట్టా నర్సింహారెడ్డి పేర్కొన్నారు. సోమవారం రూ. 2 కోట్ల నిధులతో చేపట్టిన ల్యాబ్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం వీసీ మాట్లాడుతూ జేఎన్టీయూలో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో డైరెక్టర్‌గా పని చేసి పదవీ విరమణ పొందిన డాక్టర్ శశికళ ఆధునిక పరికరాలతో రూ. 2 కోట్లతో సైన్స్ ల్యాబ్‌ను సిద్ధం చేశారని తెలిపారు.
సైన్స్ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా జేఎన్టీయూలో సైన్స్‌ల్యాబ్‌ను రూపొందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో వర్సిటీ డైరెక్టర్ డాక్టర్ విజయకుమార్‌రెడ్డి, రిజిస్ట్రార్ డాక్టర్ కె. వెంకటేశ్వర్లు, వర్సిటీ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ విభాగాధిపతి డాక్టర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.