 
                                                            అమీర్‌పేట్, అక్టోబర్ 30: తండ్రి దౌర్జన్యాలను కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ పునికి పుచ్చుకున్నాడని గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థికి పెరుగుతున్న ఆదరణను చూసి ఆయనకు మతి భ్రమించి ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి గల్లీలు దాటలేరు.. మీ ఇండ్లు చూడలేరంటూ సామాజిక మాధ్యమాల్లో బహిరంగంగా బెదిరింపులకు దిగడం ఆయనకే చెల్లిందన్నారు.
ఇటువంటి వ్యక్తిని గెలిపిస్తే నియోజకవర్గంలో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉండబోతుందో అర్థమవుతుందని చెప్పారు. గతంలో అసాంఘిక శక్తుల నియంత్రణకు చేపట్టే చర్యల్లో భాగంగా నగర బహిష్కరణకు గురైన వ్యక్తికి చెందిన కుటుంబ సభ్యుడు పోటీలో ప్రధాన పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండటాన్ని ఓటర్లు జీర్ణించుకోలేకపోతున్నారని వివరించారు. ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు భంగపాటు తప్పదని.. ఓటర్లు, వ్యాపారులు ధైర్యంగా ఉండాలని సూచించారు.
 
                            