ACB Raids | హైదరాబాద్ : వనస్థలిపురం సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. సబ్ రిజిస్ట్రార్ రాజేశ్ రూ. 70 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఓ రిజిస్ట్రేషన్ విషయంలో డబ్బులు డిమాండ్ చేసి రూ. 70 వేలు తీసుకుంటుండగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. రాజేశ్‌తో పాటు డాక్యుమెంట్ రైటర్ రమేశ్‌ను కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆస్తి రిజిస్ట్రేషన్ విషయంలో ఓ వ్యక్తి నుంచి రూ. లక్ష లంచం డిమాండ్ చేశారు సబ్ రిజిస్ట్రార్. ఇవాళ రూ. 70 వేలు లంచం తీసుకుంటుండగా రాజేశ్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకున్నారు.
సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు గత రెండు గంటలుగా సోదాలు చేస్తుండడంతో డాక్యుమెంట్ రైటర్లు తమ షాపులకు తాళాలు వేసుకొని అక్కడ నుండి పరార్ అయ్యారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా ఫైళ్లను శోధిస్తున్నారు.