హైదరాబాద్ : డ్రగ్స్(Drugs) కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. విస్తృతంగా సోదాలు చేపడుతూ పలువురిని అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా కర్నాటక(Karnataka) ఉంచి హైదరాబాద్కు మాదక ద్రవ్యాలు తరలిస్తున్న ముఠాను వనస్థలిపురం(Vanasthalipuram) పోలీసులు ఎల్బీ నగర్ ఎస్వోటీ పోలీసులతో కలిసి నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 26 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎవరైనా డ్రగ్స్ రవాణా చేసినా అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.