రవీంద్రభారతి, డిసెంబర్29 : మదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం రవీంద్రభారతి సమావేశ మందిరంలో వైద్యశ్రీ అవార్డు-2022 ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు మాట్లాడుతూ.. కరోనా సమయంలో వైద్యులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజలకు సేవచేయడం ఎంతో అభినందనీయమన్నారు.
అలాంటి వైద్యులకు అవార్డులు ప్రదానం చేయడం వల్ల మరింత ఉత్సాహంతో ప్రజలకు సేవచేసే అవకాశం ఉంటుందన్నారు. అనంతరం పలువురు వైద్యులకు వైద్యశ్రీ అవార్డులతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లికార్జున్‌రావు , దైవజ్ఞశర్మ, తదితరులు పాల్గొన్నారు.