Uppal MLA | చర్లపల్లి, జూన్ 20 : ఖైరతాబాద్‌లోని వాటర్ వర్క్స్ కార్యాలయంలో జలమండలి ఎండీ అశోక్ కుమార్ రెడ్డిని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కలిసి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. చర్లపల్లి డివిజన్ పరిధిలోని మోడీ విస్టాలో వాటర్ బిల్స్ అధికంగా వస్తున్నాయని, నియోజకవర్గ పరిధిలోని పలు సమస్యలను ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అశోక్కుమార్రెడ్డికి వివరించారు.
అనంతరం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. చర్లపల్లి డివిజన్ మోడీ విస్టాలో వాటర్ బిల్స్ అధికంగా రావడంతో పాటు బిల్లులు ఇష్టారాజ్యంగా వేస్తున్నారని ఎండీ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన సానుకూలంగా స్పదించారు. సమస్యను పరిష్కారించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన దశలవారిగా సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలో మంచినీటి సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సినీయర్ నాయకుడు నేమూరి మహేశ్‌గౌడ్, మోడి విస్టా సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి, కాలనీవాసులు వీరబ్రహ్మచారి, కృష్ణారావు, నర్ర వీరభద్రరావు, భాస్కర్, భరణి తదితరులు పాల్గొన్నారు.