కాప్రా, అక్టోబర్ 17: ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. నాయకులు ఇంటింటికి తిరుగుతూ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి ఓటువేసి గెలిపించాలని కోరుతున్నారు. ఇందులో భాగంగా మంగళవారం కాప్రా డివిజన్ పరిధిలోని సాయిబాబానగర్, సాయిరాంనగర్ కాలనీల్లో బీఆర్ఎస్ శ్రేణులు ఎన్నికల ప్రచారం చేపట్టారు. స్థానిక కార్పొరేటర్ స్వర్ణరాజు, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, బైరి నవీన్‌గౌడ్ ఆధ్వర్యంలో డివిజన్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నేతలు బృం దా లుగా తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఇంటిలోని వారినందరిని పలుకరిస్తూ బీఆర్ఎస్ కరపత్రాలను పంచుతూ పార్టీ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ గెలిస్తేనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతాయని అన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గిల్బర్ట్, ఎన్.మహేశ్, కొండల్‌గౌడ్, బంక వెంకటేశ్, సోమ్‌నాథ్, మచ్చపాండు, వస్ర్తాల వెంకటేశ్, భిక్షపతి, మల్లేశ్ వంశరాజ్, మల్లారెడ్డి, శ్రీకాంత్, పవన్, రఫీక్, ఎండీ అలీ, ఇంద్రయ్య, రాజు వంశరాజ్, గణేశ్, సురేఖ, సరోజ, సుజాత, మాధురి, ఇందిరాగౌడ్, తదితరులు పాల్గొన్నారు.
రామంతాపూర్, అక్టోబర్ 17 : ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఉప్పల్ బీరప్ప గడ్డ, చిలుకానగర్ , నాచా రం డివిజన్ ఇందిరానగర్, తదితర ప్రాంతాల్లో మంగళవారం కార్పొరేటర్లు శాంతి సాయిజెన్ శేఖర్, గీతాప్రవీణ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. బండారు లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించడం ద్వారా ఉప్పల్ మరింత అభివృద్ధి చెందుతుందన్నా రు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
ఉప్పల్ ఎమ్మెల్యే గా బండారి లక్ష్మారెడ్డిని గెలిపించాలని కోరుతూ మంగళవారం రామంతాపూర్ డివిజన్లోని ఆనంద్‌నగర్, తదితర ప్రాంతాల్లో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు, ఓటర్లకు వివరించారు. ఈకార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గంధం జ్యోత్స్ననాగేశ్వరరా వు, పాలకూర సరిత శ్రీకాంత్‌గౌడ్, సూరంశంకర్, చాంద్‌పాషా, కొప్పు నర్సింగ్‌రావు, సంధ్యారాణి, తదితరులు పాల్గొన్నారు.
మల్లాపూర్, అక్టోబర్ 17 : ఎన్నికల ప్రచారంలో బాగంగా మల్లాపూర్ డివిజన్ పరిధిలోని బాబానగర్, పలు కాలనీల్లో ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి గెలుపు కోసం కార్పొరేటర్ పన్నాల దేవేందర్‌రెడ్డి గడప గడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షే మ పథకాలను కాలనీవాసులకు తెలియజేస్తూ.. కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.